న్యూఢిల్లీ: నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్ పెట్టుబడులు, ఆదాయం, డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజల అవసరాలను, దశాబ్దపు ఆర్థిక అంచనాలను పరిపూర్ణం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని.. ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, జౌళి పరిశ్రమ, సాంకేతిక రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు. ఆదాయాన్ని పెంచేందుకు 16 కీలక అంశాలపై దృష్టి సారించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
వాటిపై దృష్టి సారించాం: ప్రధాని మోదీ